
ఫలించిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి కృషి
1వ రోడ్డు కాశీ విశ్వేశ్వర, కోదండ రామాలయానికి రూ.3.60 కోట్లు మంజూరు
ఎమ్మెల్యేకు లేఖ పంపిన దేవాదాయశాఖ మంత్రి ఆనం
ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయశాఖ మంత్రి ఆనంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం డిసెంబర్ 03 అనంత జనశక్తి న్యూస్
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కృషి ఫలించింది. నగరంలోని మొదటి రోడ్డు శ్రీ కాశీవిశ్వేశ్వర-కోదండరామ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.3.60కోట్ల దేవాదాయశాఖ మంజూరు చేసింది. ఈమేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు లేఖ పంపారు. జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కల్గిన ఈ ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. పురాతనమైన ఈ ఆలయానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణం చేయాలన్న కోరిక భక్తుల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి దేవదాయ శాఖ దృష్టికి ఈ అంశాన్ని పలుసార్లు తీసుకెళ్లారు. గత అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి మంత్రి ఛాంబర్ కు వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఆలయానికి రూ.4.50కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆలయానికి సంబంధించిన ఫోటోలను ఇతర వివరాలను మంత్రికి సమర్పించారు. దీనిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సానుకూలంగా స్పందించి.. ఆలయానికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, ప్రభుత్వ నిబంధన ప్రకారం రూ.3.60కోట్లు మంజూరు చేశారు. మిగిలిన 20శాతం నిధులు విరాళాల ద్వారా ప్రజలు అందించాలని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే దగ్గుపాటికి లేఖ కూడా పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయశాఖ మంత్రి ఆనం కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల అభిప్రాయాలను గౌరవించి.. ఆలయ నిర్మాణానికి సహకరించినందుకు ధన్యవాదములు తెలిపారు. త్వరలోనే ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని.. జిల్లాలోనే ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.








