రైతుల బాగుకోరే ప్రభుత్వం మాది

రైతుల బాగుకోరే ప్రభుత్వం మాది

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి

‘రైతన్నా మీ కోసం’ రైతన్నల నుంచి విశేష స్పందన

రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు

కూటమి ప్రభుత్వం తక్కువ కాలంలోనే ఎక్కువ మేలు

46.85 లక్షల మందికిపైగా రైతులకు రూ.6,310 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు అందజేశాం

డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో రైతులకు 1,654 కోట్ల లబ్ధి కలిగిందన్నారు.

నాణ్యమైన విత్తనాలు, ఎరువులిచ్చాం

సేంద్రీయ సాగుతో ఆరోగ్యం, రాబడి..

రైతుల ద్రోహి జగన్

ఆ 5 ఏళ్లలో అన్ని రకాలుగా అన్నదాతలకు వేధింపులు : మంత్రి సవిత ఫైర్

పెనుకొండ డిసెంబర్ 03 అనంత జనశక్తి న్యూస్

రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అన్నదాత మేలు కోరే వ్యక్తి సీఎం చంద్రబాబు అని, రైతుల పేరుతో పార్టీ పెట్టుకుని వారిని అన్నివిధాలా వేధించిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. మండలంలోని రాంపురం గ్రామంలో రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమం సందర్భంగా బుధవారం నిర్వహించిన వర్క్ షాపులో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రైతులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వారి బాగుకోరుకునే ప్రభుత్వం తమదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి మార్చలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి ఏయే పంటలు వేయాలి… ఏ పంట వేస్తే అధిక దిగుబడులతో పాటు ధరలు లభిస్తాయి… ఏ ఎరువులు వాడాలి…? అనే అంశాలపై వివరించారన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమ నిర్వహణపై అన్నదాతల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అధికారులు సూచనల మేరకు పంట మార్పిడి చేస్తామని రైతులు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, పారిశ్రమికాభివృద్ధితో పాటు వ్యవసాయానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారన్నారు. వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ పెట్టుబడులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం, రాబడి

అధికారులు సూచించిన పంటలు వేయడం ద్వారా లాభాలు ఆర్జించొచ్చునని మంత్రి సవిత సూచించారు. ప్రస్తుతం చిరు ధాన్యల ఆహారాన్ని ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారని, రైతులు ఆ పంటలు సాగు చేయాలని సూచించారు. అధికారుల సూచనల మేరకు ఎరువుల వినియోగించాలని రైతులకు సూచించారు. సేంద్రీయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో రాబడి రావడంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతోందన్నారు. పెనుకొండలోని చెరువులకు ఫీడర్ చానల్ ద్వారా త్వరలో నీరందిస్తామని మంత్రి సవిత తెలిపారు.

తక్కువ కాలంలో ఎక్కువ మేలు

సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తక్కువ కాలంలోనే రైతులకు ఎక్కువ మేలు చేశామని మంత్రి సవిత వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 46.85 లక్షల మందికిపైగా రైతులకు రూ.6,310 కోట్లు అందజేశామన్నారు. 90 శాతం సబ్సిడీతో రైతులకు 1,654 కోట్లు లబ్ధి కలిగిందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేశామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలన్న ఆలోచనను కూటమి ప్రభుత్వం అడ్డుకుందన్నారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని, వ్యవసాయాన్ని లాభసాటి మార్చాలని నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

రైతులకు జగన్ ద్రోహం

అనంతరం ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, రైతుల పేరుతో పార్టీ పెట్టుకున్న జగన్…అన్నదాతలను అన్ని విధాలా వేధించారని ఆరోపించారు. అయిదేళ్ల అసమర్థ పాలనలో డ్రిప్ ఇరిగేషన్ ను నాశనం చేశారన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి, రైతులపై ఆర్థిక భారం మోపాలని చూశాడన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కూడా అందజేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి రమణ, కూటమి నాయకులు పులివెందుల పార్థసారథి రెడ్డి, యాదవ్, కురుబ కార్పొరేషన్ల డైరెక్టర్లు కేశవయ్య, శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.