గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..ఎమ్మెల్యే అమిలినేని 

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..ఎమ్మెల్యే అమిలినేని

గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం..

13 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం డిసెంబర్ 03, అనంత జనశక్తి న్యూస్

గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని గ్రామాల్లో మౌళిక సదుపాయలు అయిన సీసీ రోడ్లు, తాగునీరు, వీధి బల్బులు, పారిశుధ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.నేడు శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక సర్పంచ్ అనురాధ ధనుంజయ టీడీపీ సీనియర్ నాయకులు, అధికారులతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బావుంది ప్రారంభించారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌళిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలోను సీసీ రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు.. గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధిలో మరింత వెనుకబడిపోయాయని, కనీసం గ్రామాలకు రహదారులు కూడా నిర్మించకుండా వదిలేశారని నేడు వాటిని కూడా మంజూరు చేయించి రోడ్లు వేయిస్తామని అన్నారు..