పొట్టి శ్రీ రాములు స్మృతివనం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్,ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు.

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్.

నరసరావుపేట,నవంబర్ 30. అనంత జనశక్తి న్యూస్

అమరావతి( రాజధాని )శాఖమురు గ్రామం నందు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయించిన సంగతి విదితమే.2026 మార్చి 16న పొట్టి శ్రీరాములు 125 వ జయంతి వేడుకలలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం,మ్యూజియం,లైబ్రరీ, ఏర్పాటు చేస్తున్నట్టు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య నాయకులు విరివిగా నిధులు ఇవ్వాలని ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపు నిచ్చారు.స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని,కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట ప్రకారం స్థలం కేటాయింపు చేయడం అమరజీవి మరియు ఆర్యవైశ్యుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుందని,అందుకే ఆర్యవైశ్య సామాజిక వర్గం అంటే తనకి ఎనలేని అభిమానమని ఆర్యవైశ్యుల పిలుపు అరవిందబాబు గెలుపు అనే నినాదంతో తాను ముందుకి వెళ్లి విజయం సాదించానని అన్నారు.స్మృతి వనానికి అందరూ సహకరించాలని అన్నారు, పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు మాట్లాడుతూ కూటమి  ప్రభుత్వం వచ్చాక స్మృతి వనంకి స్థలం కేటాయింపు, పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి ప్రభుత్వం నిర్వహించేలా జీ ఓ ఇవ్వడం వాసవి అమ్మవారికి పట్టువస్త్రాలు ప్రభుత్వ లాంఛనాలతో అందించడం. పెనుగొండ పట్టణానికి వాసవి పెనుగొండ గా నామకరణం చేసే విధంగా ఆసుగులు వేయడం యావత్ ఆర్యవైశ్య జాతి హర్షిస్తూ కృతజ్ఞతలు తెలుపుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టుపల్లి సత్యనారాయణ,ఛాంబర్ అధ్యక్షుడు వనమా శివ, అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొత్తమాసు మెహర్, ఐనవోలు సాంబశివరావు, పెరుమాళ్ళ సత్యనారాయణ, తడికమళ్ళ బాల, ఆంజనేయులు,కోట వెంకటేశ్వర్లు,కొత్తూరి హనుమంతరావు, సుబ్బారాయుడు, మరియు వివిధ సంఘాల నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.