
పంచాయతీరాజ్ కమిషనర్‌ను కలిసి నిధుల విడుదల కోరిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు
వెలగపూడి, డిసెంబర్ 2. అనంత జనశక్తి న్యూస్.
నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ నిధులు తక్షణం విడుదల చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కె. కృష్ణ తేజ ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు కలిసి కోరారు. నరసరావుపేట ఏరియా హాస్పిటల్ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, అడ్వకేట్ చిన్నపరెడ్డి లతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు కేటాయించిన పంచాయతీరాజ్ నిధులు మరియు గతంలో పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే క్లియర్ చేయాలని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. నిధులు సకాలంలో అందితే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయని వివరించారు. కమిషనర్ కె. కృష్ణ తేజ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, నియమాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..








