శ్రీ సత్యసాయి సేవారత్న నేషనల్ అవార్డ్ 2025 అందుకున్న కృష్ణాపురం అఫ్సర్

శ్రీ సత్యసాయి సేవారత్న నేషనల్ అవార్డు 2025 అందుకున్న కృష్ణాపురం ఆఫ్సర్.

పుట్టపర్తి.నవంబర్24.అనంత జనశక్తి న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కృష్ణాపురం ఆఫ్సర్ కి శ్రీ సత్యసాయి బాబా 100 వ జన్మదినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మనం ఫౌండేషన్ వారి శ్రీ సత్య సాయి సేవ రత్న నేషనల్ అవార్డు 2025 ఎంపిక అయ్యాడు గత కొన్ని సంవత్సరాలుగా మనం ఫౌండేషన్ సత్య సాయి జిల్లా అధ్యక్షుడిగా మరియు వివిధ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ మనం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ న్యాయవాది డాక్టర్ చక్రవర్తి శ్రీ సత్యసాయి సేవారత్న నేషనల్ అవార్డు 2025 ని ఎంపిక చేసి ఈ అవార్డుని సోమవారం రోజున సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈ అవార్డుని అందజేశారు సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ తన సామాజిక సేవను గుర్తించి సత్యసాయి బాబా జన్మదినోత్సవం పురస్కరించుకొని అవార్డుకు ఎంపిక చేయడం చాలా గర్వంగా ఆనందంగా ఉందని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.