
జిల్లా స్థాయిలో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ర్యాలీని ప్రారంభించిన పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ సూరజ్ గనోరే.
పల్నాడు కలెక్టరేట్,నవంబర్ 25.అనంత జనశక్తి న్యూస్
కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ(MORD, Gol) వారు జండర్ అసమానత్వ సమస్యలు ఎదుర్కోవడం కొరకు నిర్మాణాత్మకమైన వ్యూహాలను అమలు చేయడం కొరకు డే NRLM ద్వారా స్వయం సహాయక సంఘాలు ఇతర ప్రభుత్వ విభాగాలు వివిధ పౌర సమాజ సంస్థలు (సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్) అనుసందానం తో ది.25.11.2025 నుండి ది.23.12.2025 వరకు నయీ చేతన 4.0 మార్పు కోసం ముందడుగు అన్ని రాష్ట్రాలలో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం (National Campaign Against Gender based Violence and Discrimination) నిర్వహించబడుచున్నది. ప్రస్తుతం ఈ ప్రచారం నాలుగవ సంవత్సరంలోనికి ప్రవేశించింది . వ్యవసాయ మరియు రైతు సంక్షేమశాఖ మంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నవంబర్ 25న న్యూఢిల్లీలో నయీ చేతన 4.0 ప్రచారాన్ని అధికారికంగా ఉదయం 11:30 కు ప్రారంభించినారు. వర్చువల్ గా జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా మండల గ్రామ మరియు సంఘ స్థాయిల నుండి సిబ్బంది మరియు సభ్యులు హాజరు కావటం జరిగినది.

జిల్లా సంయుక్త కలెక్టరు సూరజ్ గనోరే చేతులమీదుగా IEC పోస్టర్స్ ఆవిష్కరించుట జరిగినది. జిల్లా కలెక్టరు వారి కార్యాలయము నుండి గాంధీ పార్కు వరకు స్వయం సహాయక సంఘ మహిళలు, అంగన్ వాడీ కార్యకర్తలు,సిబ్బంది చే నిర్వహించిన రాలీ నందు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే,జిల్లా రెవెన్యూ అధికారి మురళి,ఆర్ డి ఓ మధులత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ,జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రాజేశ్వరి,జిల్లా లీగల్ అడ్వైజర్ ఎమేల్యమ్మ , మరియు ఇతర జిల్లా అధికారులందరూ పాల్గొనినారు.ఈ కార్యక్రమము 4 వారాలకు ఒక్కో వారము నకు ఒక్కో థీం తో ది.26.11.2025 నుండి ది.23.12.20.25 వరకు మండల సమాఖ్య, గ్రామ సమాఖ్యలు మరియు స్వయం సహాయక సంఘ సభ్యులందరికీ మహిళలు ఎదుర్కొంటున్న హింస, వివక్షల గురించి అన్ని విభాగముల వారి సమన్వయముతో నిర్దేశిత కేలండర్ ప్రకారము కార్యక్రమములు నిర్వహించ బడును.








