చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ నవంబర్ 03 అనంత జనశక్తి న్యూస్

చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాద వివరాలను వెంటనే సేకరించాలని అధికారులను ఆదేశించారు.సహాయక చర్యలను యథాశీఘ్రం ప్రారంభించాలంటూ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.