వినియోగదారుల సొమ్ము దోచేస్తున్నారు. 

వినియోగదారుల సొమ్ము దోచేస్తున్నారు.

ఏటీఎంలో మోసాలు పెరిగిపోతున్నాయి.

ఏటీఎం కొత్త చార్జీలు ప్రతి లావాదేవీలకు క్యాష్ విత్ డ్రా ఫీజు 17 నుంచి 19 రూపాయలకు పెంచారు.

ఏటీఎంల ద్వారా మెట్రో నగరాల్లో నెల కు 5 ఉచిత లావాదేవీలు.

నాన్ మెట్రో అయితే నెలకు 3 లాభాదేవిలు చేసుకోవచ్చు.

పరిమితిని మించితే అదనపు రుసుము చెల్లించాల్సిందే.

చిన్న బ్యాంక్ ఎటిఎం వినియోగదారులు ఎక్కువ చార్జీలు భరించాల్సిందే.

ఏటీఎం అంటే…. (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్) అనేది మానవ సహాయము లేకుండా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, నిధుల బదిలీలు, ఖాతా బ్యాలెన్స్ విచారణలు వంటి ఆర్థిక లావాదేవీలను చూసుకోవడానికి వీలు కల్పించే ఒక ఎలక్ట్రానిక్ యంత్రం. ఏటీఎం కార్డును ఉపయోగించి వినియోగదారులు తమ వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (పిన్) ను నమోదు చేసి సురక్షితంగా లావాదేవీలు జరుపవచ్చు. బ్యాంకుకు వెళ్లకుండా శ్రమ లేకుండా డబ్బు తీసుకునే వీలు కల్పిస్తుంది. బ్యాంకు సెలవుల్లో లేదా బ్యాంకు వేళలు కాకుండా ఎప్పుడైనా ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు. ఏటీఎంలలో మోసాలు పెరిగిపోతున్నాయి. వీటిలో స్కామింగ్ ( కార్డుల వివరాలు దొంగలించడం) పిన్ దొంగతనము, నకలి ఏటీఎం యంత్రాలు వాడకం, వినియోగదారులు తమ పిన్ నెంబర్ను ఎవరితోనూ పంచుకోకుండా ఏటీఎంలలో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, అనుమానాస్పదంగా ఉన్న ఏటీఎంల దగ్గర లావాదేవీలు చేసుకోపోవడం మరియు ఏటీఎం నుండి డబ్బు తీసిన తర్వాత రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మోసాల నుండి రక్షించుకోవడానికి బ్యాంకులు, పోలీసులు మరియు వినియోగదారుల అవగాహనతో ఉండాలి.

సత్యసాయి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29, అనంత జనశక్తి న్యూస్:

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వినియోగదారులకు ఏటీఎంలు దాదాపు అరకొర సదుపాయాలు కు ఉపయోగపడుచున్నవి. డబ్బు ఉంటే మిషన్లు పనిచేయవు. ఏటీఎం మిషన్లు పనిచేసే సందర్భంలో డబ్బులు ఉండవు. వినియోగదారులు అత్యవసర కోసం ఏటీఎంలకు వెళ్తే…. వారి నసీబ్ బాగుంటే ఏటీఎం మిషన్లు పనిచేస్తూ…. డబ్బు ఉంటే సంతోషమే. పండగలకు పబ్బాలకు అత్యవసర సమయంలో ఏటీఎంలు పనిచేయకుంటే వారి అగచాట్లు గగనమే. ఏటీఎం మిషన్లు పని చేయకుంటే బ్యాంకులో డ్రా చేద్దాం అనుకుంటే వినియోగదారుల రద్దీతో సమయం వృధా అవుతుంది. లేదా గంటల వ్యవధిపట్టే అవకాశం వల్ల వినియోగదారుడు ఇబ్బందులకు గురి అవుతారు. తద్వారా ఏటీఎంలో డబ్బు నిల్వ ద్వారా సులభమైన లావాదేవీలు జరుపుకొనుటకు సంపూర్ణ అవకాశాన్ని బ్యాంకులు కల్పించాయి. ఏటీఎంలను బ్యాంకులు సంపూర్ణ సేవలకు ఉపయోగపడేటట్లు వినియోగదారులకు కల్పిస్తే వారి లావాదేవీలు సులభతరం అవుతాయి. వినియోగదారుడు బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేయకుండా సులభతర సేవలకు ఏటీఎంలు ఉపయోగపడాలి.

వినియోగదారులకు ఏటీఎం లతో బాదుడు:

వినియోగదారుడికి బ్యాంకింగ్ సేవలకు ఏటీఎం సులభతరం. ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ను ఉపయోగించి నగదును డ్రా చేసుకోవడానికి, నగదు చెక్ చేసుకోవడానికి మినీ స్టేట్మెంట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నగదు డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్ ఎంతగా పెరిగిన ఇప్పటికీ చాలామంది ఏటీఎం ద్వారా నగదును తీసుకుంటున్నారు. నగదు లావాదేవీలు పెరుగుతుండడంతో ఏటీఎంల వినియోగంపై కొత్త చార్జీలను భారత్ రిజర్వ్ బ్యాంకు అమలు చేయడానికి సిద్ధమైంది. ఏటీఎం నుంచి నగదును డ్రా చేసుకోవడానికి, నగదును చెక్ చేసుకోవడానికి అయినా వైట్ లేబుల్ ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎంల లావాదేవీలపై ఏటీఎం చార్జీలను పెంచాలని కోరారు. వీరి ప్రతిపాదనను “నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా”వీటికి అనుగుణంగా ఆర్బిఐ కూడా ఆమోదించింది. దీంతో కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. ఏటీఎం కొత్త చార్జీలు ప్రతి లావాదేవీలకు క్యాష్ విత్ డ్రా ఫీజు 17 నుంచి 19 రూపాయలకు పెంచారు. ఏ బ్యాంకు ఖాతాదారుడైన మెట్రో నగరాలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నాన్ మెట్రో అయితే నెలకు 3 లాభాదేవిలు చేసుకోవచ్చు. ఈ పరిమితిని మించితే కొత్త లావాదేవీలు వర్తిస్తాయి. మీరు మీ బ్యాంకు చెందిన కార్డుతో ఇతర బ్యాంకు ఏటీఎం లను ఉపయోగిస్తే వీటిపై చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి ప్రభావం చిన్న బ్యాంకులపై ఎక్కువగా ఉంటుంది. చిన్న బ్యాంకుల ఏటీఎంలు తక్కువగా ఉంటాయి. వాటి ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలను వినియోగిస్తారు. తద్వారా వారు ఎక్కువ ఛార్జీలు భరించక తప్పదు. వీటితోపాటు ప్రతి ఏటీఎం వినియోగదారుడు కి సబ్ చార్జెస్ అని జీఎస్టీ అని రిజర్వ్ బ్యాంక్ నిబంధనలతో వినియోగదారుడుపై బాదుడే…. బాదుడు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలు కనుమరుగు…,

ప్రతి ఏటీఎంలు 24 /7 పని వేళలు. కానీ ధర్మవరం పట్టణంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పని వేళలు మాత్రం బ్యాంకు పని చేసే సమయాలు మాత్రమే ఏటీఎంలు పనిచేస్తాయి. అంటే 8 గంటలు మాత్రమే. మిగతా సమయాలలో పట్టణంలోని సుదర్శన కాంప్లెక్స్ లో గల ఎటిఎం, పుట్టపర్తి రోడ్డు సమీపాన గల సాయిబాబా గుడి దగ్గర గల ఏటీఎంలు పనిచేయడం లేదు. వినియోగదారులు బ్యాంకు మేనేజర్ ని సంప్రదించగా ఏటీఎంలు పనిచేయలేదు అని అడగగా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తోంది అని అందువల్లే బ్యాంకు సమయాల్లో మాత్రమే ఏటీఎంలో పనిచేయుచున్నాయని బ్యాంకు సేవలు ముగిసిన అనంతరం ఏటీఎంలు కూడా మూసివేయుచున్నామని తెలియజేశారు. వీటివల్ల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ దారులకు ఏటీఎంల ద్వారా అదనపు చార్జి రూపాలలో దండుకుంటున్నారని ఆ బ్యాంకు వినియోగదారులు వాపోతున్నారు. ఇకనైనా సెక్యూరిటీని నియమించి ఏటీఎంలు 24/7 గా పని చేయాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.

గతంలో బ్యాంకులు మాత్రమే ఉండేవి… ఏటీఎంలు ఉండేవి కాదు!

బండారు సదాశివ, మారాల గ్రామం, బుక్కపట్నం మండలం. శ్రీ సత్యసాయి జిల్లా.

గతంలో బ్యాంకుల్లో మాత్రమే లావాదేవీలు జరిగేవి. డబ్బు తీసుకోవాలన్న, డబ్బు వేయాలన్న బ్యాంకులకు వెళ్లాల్సిందే… ఎంత సమయమైనా అక్కడే ఉండి లావాదేవీలు చేసుకోవాల్సిందే. కాసింత ఇబ్బందికర వాతావరణం ఉండేది. ఇప్పుడు ఏటీఎంల ద్వారా సులభతరమైన ట్రాన్సాక్షన్స్ జరుగుచున్నవి. సమయం వృధా కాదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనము టెక్నాలజీ వైపు పరిగెడుతున్నాం. ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటే డబ్బుకు ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ సులభతరంగా జరుగుచున్నవి. డబ్బు లేకుండా కార్డు ఉంటే చాలు ఏ పని అయినా సులభంగా చేసుకోవడానికి వీలుంటుంది.

జర జాగ్రత్తగా ఉండాలి…. ఏటీఎంలో కూడా మోసాలే…..

బాల చంద్ర, లెక్చరర్, ధర్మవరం.

ఏటీఎం ల ద్వారా నగదు డ్రా చేసుకోవడానికి నగదు చెక్ చేసుకోవడానికి వైట్ లేబుల్ ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరిగాయి అనడంతో “నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” మరియు ఆర్బిఐ ముందు… వెనుక ఆలోచించకుండా కొత్త చార్జీల ప్రతిపాదనను తీసుకురావడం సమంజసం కాదు. ప్రతి లావాదేవీలకు క్యాష్ విత్ డ్రా ఫీజు కింద 17 నుంచి 19 రూపాయలు పెంచడం దారుణం. అందులో ఏటీఎంలో 3 సార్ల కు మించి ట్రాన్సాక్షన్స్ జరిగితే వీటిపై అదనపు రుసుము వేయడం దారుణం. చిన్న బ్యాంకుల్లో ఏటీఎంలు పనిచేయవు అలాంటి సందర్భంలో వినియోగదారులపై ఎక్కువ చార్జీలు భరించే అవకాశం ఉంటుంది. అందులో బ్యాలెన్స్ ఎంక్వయిరీ ఫీజు 6 నుంచి 7 రూపాయలు పెంచడం అన్యాయం. రాను… రాను ఏటీఎం లతో వినియోగదారులు జర జాగ్రత్తగా ఉండాలి.