ఇరాన్‌ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా దాడి

ఇరాన్‌ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా దాడి

అమెరికా మార్చి 14″అనంత జనశక్తి న్యూస్”

ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఖర్గ్‌ ద్వీపంపై అమెరికా దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. ఆ ద్వీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా చరిత్రలోనే ఇది అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలుస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు.అయితే చమురు నిల్వలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్‌ ఆటంకం కలిగిస్తే తమ నిర్ణయాన్ని వెంటనే మార్చుకుంటామని హెచ్చరించారు. తాము దాడి చేయాలని నిర్ణయిస్తే ఇరాన్‌ అడ్డుకోలేదని కూడా ట్రంప్‌ వ్యాఖ్యానించారు.ఇరాన్‌ చర్యలపై అమెరికా సన్నద్ధంగా ఉందని, పరిస్థితులను సమీక్షిస్తూ తదుపరి చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రభుత్వం తెలిపింది.