
గ్రీన్‌కార్డు కోసం డ్రామా.. ఇండియన్స్ అరెస్టు
అమెరికా మార్చి 14,”అనంత జనశక్తి న్యూస్”
అమెరికాలో గ్రీన్‌కార్డు పొందేందుకు నకిలీ నేర ఘటనలను సృష్టించి అధికారులను మోసం చేయాలని ప్రయత్నించిన 11 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న ఈ వ్యక్తులు ‘యూ వీసా’ పొందేందుకు చోరీ జరిగినట్లు నాటకం ఆడినట్లు విచారణలో బయటపడింది.ఫెడరల్ ప్రాసిక్యూటర్ల వివరాల ప్రకారం, నిందితులు తాము నేర బాధితులమని చెప్పి అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. అమెరికాలో నేరానికి గురైన బాధితులు దర్యాప్తుకు సహకరిస్తే వారికి ‘యూ నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్’ (యూ వీసా) మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనను దుర్వినియోగం చేసి గ్రీన్‌కార్డు పొందాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.








