ఇరాన్ మిలటరీ సామర్థ్యాలు పూర్తిగా నాశనం: ట్రంప్

ఇరాన్ మిలటరీ సామర్థ్యాలు పూర్తిగా నాశనం: ట్రంప్

అమెరికా మార్చి 14,”అనంత జనశక్తి న్యూస్”

ఇరాన్ సైనిక సామర్థ్యాలను దాదాపు పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే హార్ముజ్ సముద్ర మార్గాన్ని తిరిగి తెరిచి అంతర్జాతీయ నౌకాయానానికి సురక్షితంగా, స్వేచ్ఛగా ఉంచుతామని చెప్పారు.ఈ చర్యల్లో భాగంగా చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే వంటి దేశాలు కూడా తమ నౌకలను పంపాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్ సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతిన్నందున ఆ దేశం నుంచి ఇక పెద్ద ముప్పు ఉండదని ఆయన పేర్కొన్నారు.