
ఇరాన్ యుద్ధ ప్రభావం.. భగ్గుమన్న ముడి చమురు ధరలు
ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల మైలురాయిని దాటింది.తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 109.14 డాలర్లకు చేరుకుంది. గతంలో సుమారు 70 డాలర్ల వద్ద ఉన్న ధరలు, కొద్ది రోజుల వ్యవధిలోనే భారీగా ఎగబాకాయి.ఒక్కరోజులోనే ముడి చమురు ధర దాదాపు 16 శాతం పెరగడం మార్కెట్లను కుదిపేసింది. వారం రోజుల్లోనే మొత్తం 33 డాలర్లకు పైగా పెరుగుదల నమోదు కావడం విశేషం.ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.








