మూడోసారి ప్రపంచ విజేతగా భారత్

మూడోసారి ప్రపంచ విజేతగా భారత్

ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల ఘన విజయం

అహ్మదాబాద్, మార్చి 8 : అనంత జనశక్తి న్యూస్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ తుదిపోరులో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. 96 పరుగుల తేడాతో గెలిచి భారత్ మూడోసారి ప్రపంచ కిరీటాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

భారత్ భారీ పరుగుల పర్వం

టాస్‌లో ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ప్రారంభం నుంచే భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. యువ ఆటగాడు Abhishek Sharma వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు.తరువాత ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడగా, sanju samsan అద్భుతంగా బ్యాటింగ్ చేసి 89 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. చివర్లో శివం దూబే భారీ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు.దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

బౌలర్ల ప్రతిభతో కూలిన న్యూజిలాండ్

256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. వేగవంతమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు.మరోవైపు అక్సర్ పటేల్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కుదిపేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆనందోత్సాహాల్లో అభిమానులు

భారత్ విజయం సాధించగానే స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు. “వందే మాతరం”, “జై హింద్” నినాదాలతో అహ్మదాబాద్ నగరం మార్మోగింది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలను నింపింది.మూడోసారి ప్రపంచ కిరీటాన్ని గెలుచుకున్న భారత్‌కు దేశమంతా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 🇮🇳🏆