గజ’తో సరికొత్త సందేశం.. ప్రేక్షకులను కట్టిపడేసే భావోద్వేగం

‘గజ’తో సరికొత్త సందేశం.. ప్రేక్షకులను కట్టిపడేసే భావోద్వేగం

‘అల్లకల్లోలంగా’ పాట విడుదల.. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన దర్శకుడు సాయి రాజేష్

హైదరాబాద్, సెప్టెంబర్ 3:అనంత జనశక్తి న్యూస్

సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. సతీష్ జై దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.ఈ సందర్భంగా గురువారం ‘అల్లకల్లోలంగా’ పాటను విడుదల చేశారు. కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘గజ’ టీజర్ ఆకట్టుకుందని, ఎన్నో సవాళ్లు ఎదురైనా సతీష్ జై సినిమాను వదులుకోకుండా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారని అన్నారు. మణిశర్మ, రామ్ మిర్యాల కలయికలో వచ్చిన పాట తనకు నచ్చిందని తెలిపారు. మణిశర్మతో తనకు ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని, ఆయన సంగీతంలో ఉన్న నాణ్యతను ఎవరూ అధిగమించలేరని పేర్కొన్నారు. సతీష్‌కు అండగా నిలిచిన మైత్రి శరణ్‌కు అభినందనలు తెలిపారు. ‘గజ’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.హీరో, నిర్మాత, దర్శకుడు సతీష్ జై మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మణిశర్మ వెన్నెముకలా నిలిచారని, ఆయన నుంచి క్రమశిక్షణ, అంకితభావం నేర్చుకున్నానని తెలిపారు. ఫర్నాజ్ శెట్టి మంచి నటి అని, సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. ‘గజ’లో కమర్షియల్ అంశాలతో పాటు ప్రేక్షకులు అభినందించేలా మంచి సందేశం, భావోద్వేగం ఉంటాయని అన్నారు. సినిమా ముగింపు ప్రేక్షకులను కదిలించేలా ఉంటుందని తెలిపారు. తన భార్య, నిర్మాత మైత్రి శరణ్ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.మణిశర్మ మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని సతీష్ జై ‘గజ’ చిత్రాన్ని రూపొందించారని, సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. ‘అల్లకల్లోలంగా’ పాటకు మంచి బాణీ కుదిరిందని, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.నిర్మాత మైత్రి శరణ్ మాట్లాడుతూ.. ‘గజ’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. మంచి విషయం ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అన్నారు. మణిశర్మతో పనిచేయడం తమ కల అని, ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. చిత్రాన్ని థియేటర్లలో వీక్షించి విజయవంతం చేయాలని కోరారు.ఫర్నాజ్ శెట్టి మాట్లాడుతూ.. ‘గజ’లో భాగం కావడం ఆనందంగా ఉందని, తనకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. ‘అల్లకల్లోలంగా’ పాటతో సతీష్ జై సందడి సృష్టిస్తారని పేర్కొన్నారు.గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. మణిశర్మ సంగీతాన్ని వింటూ పెరిగామని, ఆయన బాణీలకు పాటలు రాసే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. ‘గజ’కు పాటలు రాసే అవకాశం కల్పించిన సతీష్ జైకి కృతజ్ఞతలు తెలిపారు.