కృత్రిమ మేధ యుగంలో ఔషధ శాస్త్రాలపై అంతర్జాతీయ సదస్సులో అనంతపురం శాస్త్రవేత్త డా. సుష్మ ముచ్చుకోట ప్రసంగం

కృత్రిమ మేధ యుగంలో ఔషధ శాస్త్రాలపై అంతర్జాతీయ సదస్సులో అనంతపురం శాస్త్రవేత్త డా. సుష్మ ముచ్చుకోట ప్రసంగం

అనంతపురం, మార్చి 6:అనంత జనశక్తి న్యూస్

అనంతపురం జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డా. సుష్మ ముచ్చుకోట అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటారు. వియత్నాం దేశంలోని Can Tho నగరంలో ఉన్న Nam Can Tho University ఆధ్వర్యంలో నిర్వహించిన ఔషధ శాస్త్రాలు – కృత్రిమ మేధ మరియు డిజిటల్ మార్పుల యుగంలో నూతన ఆవిష్కరణలు, వినియోగం మరియు అభివృద్ధి అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆమె ఆన్‌లైన్ ద్వారా తన పరిశోధనను సమర్పించారు.మార్చి 6న వియత్నాంలోని Can Tho నగరంలో జరిగిన ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఔషధ శాస్త్ర నిపుణులు పాల్గొన్నారు.డా. సుష్మ ముచ్చుకోట తన ప్రదర్శనలో Artificial Intelligence, Genomics వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు భవిష్యత్తులో ఔషధ పరిశోధన, వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్సా విధానాల్లో ఎలా కీలక పాత్ర పోషిస్తాయో వివరించారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి క్లిష్ట వ్యాధుల చికిత్సలో కృత్రిమ మేధ ఆధారిత ఖచ్చితమైన వైద్య విధానాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు డా. సుష్మ ముచ్చుకోట ప్రదర్శనను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.ఇదివరకు కూడా ఆమె పలు ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల బెంగళూరు లో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె ఉత్తమ జాతీయ పురస్కారాన్ని అందుకొని మరోసారి తన ప్రతిభను చాటారు.అంతర్జాతీయ వేదికపై ఆమె సాధించిన ఈ విజయంతో అనంతపూర్ జిల్లా మరియు ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైంది.