రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా తాత్కాలిక మినహాయింపు

రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా తాత్కాలిక మినహాయింపు

“అనంతజనశక్తి న్యూస్”

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో అమెరికా భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు 30 రోజుల పాటు ప్రత్యేక అనుమతి కల్పించినట్లు అమెరికా ఖజానా శాఖ వెల్లడించింది.సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురు నౌకలను భారత శుద్ధి కర్మాగారాలు కొనుగోలు చేసేందుకు ఈ అనుమతి వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రష్యా నుంచి చమురు దిగుమతులను వేగవంతం చేస్తున్నాయి.ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరా అంతరాయం రాకుండా చూడడం, ధరల ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు.