ఎడ్యుకేట్ ది సొసైటీ 14వ వార్షికోత్సవం సందర్భంగా సొసైటీ అధ్వర్యంలో పట్టణంలో పలుసేవా కార్యక్రమాలు

ఎడ్యుకేట్ ది సొసైటీ 14 వ వార్షికోత్సవ సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు

సత్తెనపల్లి,నవంబర్11. అనంత జనశక్తి న్యూస్.

ఎడ్యుకేట్ ది సొసైటీ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న శుభ సందర్భంగా ఆదరణ అనాథ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులతో కలిసి వార్షికోత్సవ కేక్ కట్ చేశారు వారికి బ్రెడ్ మరియు బిస్కెట్స్ అందించారు ,అనంతరం పట్టణంలోని యానాది కాలనీలో భరతమాత అన్నప్రసాద వితరణ 741 వ రోజు ఎడ్యుకేట్ ది సొసైటీ వారి సహాయంతో 121 మంది నిరుపేదలకు భోజనం అందించటం జరిగింది.

ఈ సందర్బంగా దివ్వెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎడ్యుకేట్ ది సొసైటీ యొక్క సేవలను కొనియాడారు. అంతేకాకుండా ఈ సంస్థ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షేక్.అన్సారీ మరియు భరత్, షరీఫ్, నరసింహ పాల్గొన్నారు.