
ఘనంగా ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో రాఖీ మీడియా అధినేత, టిడిపి రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి నల్లపాటి రాము జన్మదిన వేడుకలు.
నరసరావుపేట.నవంబర్11.
అనంత జనశక్తి న్యూస్
పట్టణంలో రాకీ న్యూస్ అధినేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్ జన్మ దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మిత్రులచే ఘన సన్మానం నిర్వహించడం జరిగినది. రాజకీయ చరిత్ర కలిగిన నల్లపాటి వంశంలో జన్మించిన వారి తాత నల్లపాటి వెంకటరామయ్య చౌదరి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా 1953-1955 సేవలు అందించి ఉన్నారు. వారి తండ్రి నల్లపాటి శివరామ చంద్రశేఖర రావు జిడిసిసి బ్యాంక్ జిల్లా చైర్మన్ గా పని చేశారు.నల్లపాటి రామచంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోరం ఆర్టిఐ రాష్ట్ర గౌరవ సలహాదారులు బత్తుల మురళి, శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ నాయకులు తాడువాయి శ్రీనివాసరావు, వాసవి వనితా క్లబ్ కార్యదర్శి నేరెళ్ల విజయలక్ష్మి, ఉజ్వల భారతి మహిళా శక్తి సేవా సంఘం ఫౌండర్ మందలపు విజయలక్ష్మి పాల్గొన్నారు.








