ఘనంగా పల్నాడు జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సమావేశం

ఘనంగా పల్నాడు జిల్లా హెచ్ ఆర్ సి ఐ సమావేశం

దాచేపల్లి,నవంబర్ 10. అనంత జనశక్తి న్యూస్.

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు
చెన్నుపాటి శ్రీకాంత్,జాతీయ ప్రధాన కార్యదర్శి మదాసు చారేంద్ర సూచన మేరకు పల్నాడు జిల్లా ఇంచార్జ్ ముత్యాలబాబు సలహాతో దాచేపల్లిలో ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం నందు జిల్లా ఉపాధ్యక్షులు కోఠారి సురేష్ ఆధ్వర్యంలో జిల్లా యూత్ వింగ్ అదనపు ప్రధాన కార్యదర్శి నడింపల్లి శ్రీకాంత్ కి దాచేపల్లి మండల అధ్యక్షులు ఆతుకూరి అమరేష్ కి జిల్లా కార్యవర్గ సభ్యులు, మాదాపూర్ సునీల్ కి సంస్థ ఐడి కార్డ్ లు ఇవ్వడం మరియు కొన్ని ముఖ్య విషయాల గురించి చర్చించడం జరిగినది,

కార్యక్రమంలో మువ్వల వెంకట మనోజ్,కోట మధుబాబు,హరిదాసు బాలు, తిరుమలవరపు సైదారావు పాల్గొనడం జరిగినది.