
తెలంగాణలో ‘ఏపీ విజయ’ నెయ్యి కల్తీ వివాదం.. ఆరోపణలను ఖండించిన డెయిరీ
హైదరాబాద్”అనంత జనశక్తి న్యూస్”
తెలంగాణలో ‘ఏపీ విజయ’ బ్రాండ్ నెయ్యి కల్తీపై వస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయ డెయిరీ అధికారులు ఖండించారు. ఈ ఆరోపణలు అసత్యమని, తమ ఉత్పత్తుల నాణ్యతపై ఎలాంటి సందేహం అవసరం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు విజయ డెయిరీలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను విక్రయించే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏపీ విజయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.ఏపీ విజయ నెయ్యిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని డెయిరీ అధికారులు వెల్లడించారు. తమ ఉత్పత్తులపై నిరంతరం నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి లోపాలు బయటపడలేదని చెప్పారు.తాజాగా నెయ్యి నమూనాలను ప్రయోగశాలలకు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు తేలితే తెలంగాణ అధికారులకు సమాచారం అందిస్తామని ఏపీ విజయ డెయిరీ స్పష్టం చేసింది.








