
*మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మందపోరు*
*పల్నాటి ఉత్సవాలలో నేడే మందపోరు*
*సమసమాజ స్థాపన కోసం బ్రహ్మనాయుడు చేపట్టిన చాపకుడు కార్యక్రమం నేడే*
పల్నాటి ఉత్సవాలలో భాగంగా చాపకూడు కార్యక్రమంలో పాల్గొననున్న పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, మాచర్ల , వినుకొండ, నరసరావుపేట ఎమ్మెల్యేలు
కారంపూడి,నవంబర్ 21. అనంత జనశక్తి న్యూస్
కోడి పందెములో ఓడిపోయిన మలిదేవాదులు బ్రహ్మానాయుని నేతృత్యంలో మందాడికి చేరుకొని అక్కడ నివసిస్తుంటారు. మూడేండ్ల తరువాత నాయకురాలు నాగమ్మ మలిదేవాదులు ఎలా వున్నారు అన్నవిషయం పై వేగుల ద్వారా వాకబు చేస్తుంది. అక్కడవారు గోసంపద (ఆవులమంద)తో సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలుసుకొని ఆమెకు కన్నుగుట్టింది.ఏదో విధంగానైనా మలిదేవాదులను చీకాకు పరచాలని నలగామ రాజుకు దుర్నితిని కల్లించేలా చేస్తుంది.తొలుత నలగామ రాజు అంగీకరించక పోయినా నాయకురాలు నాగమ్మ మాటలకు ప్రలోభ పడతారు. దీంతో బ్రహ్మానాయునిపై శతృత్వం పెంచుకొంటారు. మందాడిలో ఆవుల మందతో వుంటున్న బ్రహ్మన్నపై యుద్ధం చేయించాలని సమరుడైన అర్ధవీటిలోని వీధుల పల్నీడు అను చెంచు నాయకున్ని నాగమ్మ కబురు పంపుతుంది. గతంలో పల్నీడు తండ్రి దాబుచేనిని బ్రహ్మనాయుడు ఓయుద్ధంలో ఓడిస్తారు. పగతీర్చుకోవాలని రగిలిపోతున్న ఆతనికి నాగమ్మ పిలుపుతో తన అనుచరులతో పాటు పరివారాన్ని వెంటతీసుకొని గురజాల వెళ్లారు. ఈ కార్యంను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చే నీకు మాచర్ల రాజ్యాన్నికానుకగా ఇస్తామని చెపుతుంది, దామినీడు, పల్లన్నమల్లన్న అనేవేగుల ద్వారా మందాడి పట్టణంలోనికి హరిదాసుల వేషంలో వెళ్లి మలి దేవాదుల ఆవుల మందలపై దాడి చేసేందుకు వ్యూహం పన్నుతారు. ఆవులమందకు కాపలాగా లంకన్నను నాయకుడిగా బ్రహ్మనాయుడు నియమి స్తారు.వీధుల పల్నీడు తన సైనిక బలంతో పాటు నలగామరాజు అందించి సైన్యాన్ని తీసుకొని మూకుమ్మడిగా గోవుల మందలపై దాడిచేస్తారు.ఈ దాడిలో లంకన్న వీరావేశంతో నలగాముని సైన్యాన్ని హతమారుస్తారు.వీధలపల్నీడు పన్నిన పద్మవ్యూహంలో చికుకున్న లంకన్న అభిమన్యునిలాగా వీరోచితంగా ఒంటరి పోరాటం చేస్తూ పల్నీడు తలను తెగనరికిన ఆనందంలో కల్గి ఉండి నలుమూలల నుంచి చాటుమాటు నుంచి బాణాలను ఒకేసారి వేయటంతో లంకన్న నేల కొరుగుతారు.ఈ విషయాన్ని లంకన్న అనూయయుల్లో మిగిలి వున్న పెయ్యల పేర్నీడు బ్రహ్మనాయునికి తెలియ జేస్తారు. బ్రహ్మనాయుడు తన మానస పుత్రుడైన మాల కన్నమ దాసును వెళ్ళి మందాడిని రక్షించాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు.దీంతో కన్నమదాసు నలగామరాజు సైన్యాన్ని చెంచుల సేనలను ఓడించి ఆలమందలను రక్షిస్తారు.ఇది ఇలా ఉండగా పల్నాటి ఉత్సవాలలో మూడవ రోజు మందపోరు కార్యక్రమం జరగనుంది. అలనాడు బ్రహ్మనాయుడు స్థాపించిన సమసమాజ స్థాపన కోసం అలనాడు ఏర్పాటు చేసిన చాపకూడు కార్యక్రమం నేటికీ దేవాలయం ఆవరణలో ప్రతియేటా జరుగుతుంది. ఈ చాపకూడు కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎస్పీ కృష్ణారావు,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు. శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి. బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ విప్ వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు,నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ. అరవిందబాబు, వీరితో పాటు జిల్లా అధికారులు, పల్నాడు పిఠాధిపతి పిడుగు. తరుణ్ చిన్నకేశవ్ అయ్యవారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.









