కేంద్రమంత్రి నితిన్ గడ్కరి కి ఘన స్వాగతం

కేంద్రమంత్రి నితిన్ గడ్కరి కి ఘన స్వాగతం.

-పుట్టపర్తిలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం.

జాతీయ రహదారుల అభివృద్ధిపై కీలక సమీక్ష

-జాతీయ రహదారుల పురోగతిపై సమగ్ర సమీక్ష చేసిన నితిన్ గడ్కరీ

-జిల్లాలో మౌలిక సదుపాయాలకు ఊతం

-జిల్లా కనెక్టివిటీ పెంపుకు కేంద్రం కట్టుబాటు… నితిన్ గడ్కరీ భరోసా

శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, నవంబర్ 20, అనంత జనశక్తి న్యూస్:

పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర రోడ్లు, రవాణా మరియు జాతీయ హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పుట్టపర్తికి విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో రాష్ట్ర మంత్రులు సత్య కుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత, ఎమ్మె‌స్ రాజు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.తరువాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశాంతి నిలయానికి చేరుకొని సాయికుల్వంత హాల్లో శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్శనలో రాష్ట్ర మంత్రులు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు.కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ,తరువాత శ్రీనివాస గెస్ట్ హౌస్‌లో, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారుల అభివృద్ధి పనులపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మంత్రులు సత్య కుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సవిత, ఎన్ఎచ్ఏఐ ఉన్నతాధికారులు, ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో అధికారులు

ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి పనుల పురోగతి, ప్రతిపాదిత ప్రాజెక్టులు, జిల్లాలో కొత్తగా గుర్తించిన కనెక్టివిటీ అవసరాలు, రహదారి విస్తరణ, భద్రతా చర్యల బలోపేతం, భవిష్యత్ రహదారి అభివృద్ధి ప్రణాళికలపై పూర్తి వివరాలు అందించారు.కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సత్యసాయి జిల్లాలో రోడ్ల నాణ్యత, కనెక్టివిటీ, హైవే సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన అన్ని జాతీయ రహదారి ప్రాజెక్టులకు అవసరమైన మద్దతు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.