
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 12వ తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ ని విజయవంతం చేయండి – పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట,నవంబర్ 09.అనంత జనశక్తి న్యూస్
స్థానిక గుంటూరు రోడ్డులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన చేపట్టనున్న ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై నిరసన తెలియజేయడానికి నవంబర్ 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు స్థానిక గుంటూరు రోడ్డులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి మల్లమ్మ సెంటర్ మీదుగా ఆర్డిఓ ఆఫీస్ వరకు ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణల ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టనున్నామని ఈ ర్యాలీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , నాయకులు , అభిమానులు, ప్రజాసంఘాల వారు మరియు కార్యకర్తలు, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని,ముఖ్యంగా ఈరోజు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని, దీనికి ప్రజలు పూర్తిగా మద్దతునిస్తూ సంతకాలు చేస్తున్నారని, ప్రజల్లో ఈ ఉద్యమం ఉదృతంగా కొనసాగుతున్నప్పటికీ ,కూటమి ప్రభుత్వం ఏమాత్రం చలించకుండా “దున్నపోతు మీద వాన కురిసినట్టు” ముందుకు వెళ్లడం చాలా బాధాకరమని, ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గంలో అద్భుతంగా జరుగుతుందని, ఈ సంతకాల సేకరణ ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా పాల్గొంటున్నారని ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని ,దీనికి పెద్ద ఎత్తున ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని, కావున ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం.








