జాతీయ న్యాయసేవా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని

జాతీయ న్యాయసేవా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని.

అచ్చంపేట,నవంబర్ 09. అనంత జనశక్తి న్యూస్.

మండలంలోని వేల్పూరు గ్రామంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయ స్థాన ఆదేశాలమేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటి ఛైర్మన్ మరియు సివిల్ జడ్జీ ( సీనియర్ డివిజన్) సత్తెనపల్లి న్యాయమూర్తి వి.విజయ కుమార్ రెడ్డి సూచనల మేరకు జాతీయ న్యాయసేవల దినోత్సవ కార్యక్రమం ఆదివారం వేల్పూరు గ్రామంలోని స్థానిక యస్.సి. కాలనీలో జరిగింది.

ఈ సందర్బంగా పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని మాట్లాడుతూ ఉచిత న్యాయం మరియు సత్వర న్యాయ పరమైన పరిష్కారాల కోసం ప్రతి ఒక్కరు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.అలాగే డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా సత్తెనపల్లి కోర్టు పరిధిలోని ప్రజలు తమ తమ పెండింగ్ కేసులను పరిష్కరించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది యస్. వీరయ్య , పారా లీగల్ వాలంటీర్ శిఖా తిమోతి స్థానిక ప్రజలు పాల్గొన్నారు.