ఆస్తి వివాదం రక్తపాతం

ఆస్తి వివాదం రక్తపాతం…

అన్నను హతమార్చిన తమ్ముడు

నంద్యాల ఏప్రిల్ 12, అనంత జనశక్తి న్యూస్

ఆళ్లగడ్డ మండలంలో ఆస్తి వివాదం ఘోర హత్యకు దారితీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మండలంలోని ఆర్. కృష్ణాపురం గ్రామానికి చెందిన కుటుంబంలో ఆస్తి పంచుకునే విషయంలో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి.శనివారం రాత్రి మరోసారి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తగాదా కాస్త ఘర్షణగా మారడంతో తమ్ముడు విజయరాజు ఆవేశానికి లోనై రోకలిబండతో అన్న దైవభక్తుడు (40)పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దైవభక్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నిందితుడు విజయరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.