
స్టాఫ్ నర్స్, పారామెడికల్ కాంట్రాక్ట్ జేఏసీ అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
చైర్మన్‌గా దిన్నె శరత్ బాబు బాధ్యతలు స్వీకరణ
అనంతపురం ఏప్రిల్ 19, అనంత జనశక్తి న్యూస్
అనంతపురం జిల్లా ఏపీ ఎన్‌జీఓ హోమ్‌లో స్టాఫ్ నర్స్, అలైడ్ పారామెడికల్ కాంట్రాక్ట్ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు జక్కల మాధవ, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్, మహిళా అధ్యక్షురాలు జమీల బేగం, కుందుర్పి తాలూకా కోశాధికారి మధుబాబు, స్టేట్ కాంట్రాక్ట్ కో-కన్వీనర్ నరేంద్ర హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా, చైర్మన్‌గా దిన్నె శరత్ బాబు, వైస్ చైర్మన్‌లుగా రాజగోపాల్, ఉపేంద్ర, మాధవి, వన్నూర్ వలి, పవన్ కుమార్ ఎన్నికయ్యారు. కన్వీనర్‌గా టి. వెంకటనారాయణ, కో-కన్వీనర్‌లుగా బాలగోబన్న, శివప్రసాద్, అరుణ ఎన్నిక కాగా, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ప్రశాంతి, వంశీ, లావణ్య, హేమలత నియమితులయ్యారు.సభను ఉద్దేశించి జక్కల మాధవ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని, వారికి సమాన పనికి సమాన వేతనం (100% గ్రాస్), చెల్లించబడే సెలవులు, హెల్త్ కార్డులు, బదిలీలు వంటి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీకి చెందిన కాంట్రాక్ట్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








