భద్రాచలం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

భద్రాచలం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్ మార్చి 19,”అనంత జనశక్తి న్యూస్”

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు కలిసి ఆహ్వానించారు.ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 27న జరిగే శ్రీ సీతారాముల వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీమతి కొండా సురేఖ ,  తుమ్మల నాగేశ్వర రావు  పొంగులేటి శ్రీనివాస రెడ్డి , రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు , ఆలయ ఈవో దామోదర్ రావు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.