
ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభం
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు
విజయవాడ మార్చి 19, అనంత జనశక్తి న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై వేడుకలను ప్రారంభించారు.వేదికపై జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి, ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.అలాగే, పండితుడు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించి నూతన సంవత్సర ఫలితాలను వివరించారు.








