
భారత్‌కు వరుసగా ఎల్పీజీ నౌకలు…
సరఫరా బలోపేతం!
న్యూ ఢిల్లీ”అనంత జనశక్తి న్యూస్”
మంగళూరు పోర్టుకు ‘పిక్సిస్ పయనీర్’ నౌక విజయవంతంగా చేరింది. ఈ నౌకలో మొత్తం 16,714 టన్నుల ఎల్పీజీ సరుకు చేరినట్లు అధికారులు తెలిపారు.దేశంలో గ్యాస్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారంలో మరింత భారీగా ఎల్పీజీ దిగుమతులు జరగనున్నాయి. మొత్తం 72,700 టన్నుల ఎల్పీజీ రానుందని సమాచారం.ఇందులో భాగంగా ఈ నెల 25న 26,687 టన్నుల ఎల్పీజీతో ‘ఓషన్’ నౌక రానుండగా, ఈ నెల 29న మరో నౌక 30 వేల టన్నుల ఎల్పీజీతో భారత తీరానికి చేరుకోనుంది.ఈ వరుస దిగుమతులతో దేశంలో ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.








