4 గంటల సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలి: రాజమౌళి ప్రశంసలు

4 గంటల సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలి: రాజమౌళి ప్రశంసల

హైదరాబాద్ మార్చి 21, అనంత జనశక్తి న్యూస్

రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ‘ధురంధర్‌ 2’ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. నాలుగు గంటల నిడివి ఉన్న సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.ఈ చిత్రం మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకు ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా ఉత్కంఠభరితంగా రూపొందించారని కొనియాడారు. ‘ధురంధర్‌-1’ కంటే ఈ సీక్వెల్‌ మరింత మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు.కథా రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక విభాగాలు, సంగీతం, డిజైన్‌, దర్శకత్వం వంటి అన్ని అంశాల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని తెలిపారు. కథనం అంతా నిజమైన ఉత్కంఠను సృష్టించేలా సాగిందని పేర్కొన్నారు.దర్శకుడు ఆదిత్య ధర్‌ తన ప్రతిభతో అద్భుతమైన చిత్రం రూపొందించారని రాజమౌళి ప్రశంసించారు.