వెనెజువెలా అధ్యక్ష భవనం సమీపంలో బాంబుల మోత

వెనెజువెలా అధ్యక్ష భవనం సమీపంలో బాంబుల మోత

వెనెజువెలా రాజధానిలోని అధ్యక్ష భవనం సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్ష భవనాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, విమానాలు చక్కర్లు కొట్టడంతో సుమారు 45 నిమిషాల పాటు భయానక వాతావరణం నెలకొంది.అనూహ్య ఘటనతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. కాల్పుల సమయంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు డ్రోన్లపై కాల్పులు జరిపాయి. భద్రతా చర్యలు ముమ్మరం చేయడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.