
దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ వైఎస్ఆర్సిపి
కార్పొరేట్లను వైసీపీ నేతలు బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేశారు
వైయస్ఆర్సీపీ తీరు మారకుంటే భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా రావంటు వెల్లడి
నెల్లూరులో ఎన్టీఆర్ సుజలం సఫలం
నగరంలోని పలు డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి నారాయణ
డివిజన్ కు విచ్చేసిన మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు ,టిడిపి నేతలు
కూటమి ప్రభుత్వంలో 2 రూపాయలకే 20 లీటర్ల సురక్షిత మంచినీరు అందిస్తున్నాం
నెల్లూరును రోల్ మోడల్ గా మారుస్తా మంత్రి
గత వైసీపీ ప్రభుత్వం మంచినీటి పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేపిందని మండిపాటు
నెల్లూరు డిసెంబర్ 21 అనంత జనశక్తి న్యూస్
వైఎస్సార్సీపీ దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అని.. టిడిపిలోకి వచ్చి ఉన్న కార్పొరేటర్లను తీసుకెళ్లి తాడేపల్లిలో కండువాలు వేయించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.. కార్పొరేషన్ లో బలం లేకపోయినా వైఎస్సార్ సీపీకి గిల్లికజ్జాలకు దిగిందన్నారు.. మా బలం ఎంతో చూడమని రెచ్చగొట్టారని.. మాకు 41 మంది కార్పొరేటర్ల సంపూర్ణ మద్దతు ఉందన్నారు …కార్పొరేటర్లను వైఎస్సార్సీపి నేతలు బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.. వాళ్ళ కవ్వింపు ధరణితో మా నాయకులు జాగ్రత్త పడ్డారన్నారు… క్యాంపులు పెట్టాల్సిన అవసరం మాకు లేదన్నారు . వైఎస్సార్ సీపీ తీరు మారకుంటే భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ తెలిపారు.ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు..నెల్లూరు నగరంలో పలు డివిజన్లలో మంత్రి పర్యటించారు .డివిజన్ కు వచ్చిన మంత్రి నారాయణకు స్థానిక ప్రజలు టిడిపి నేతలు ఘన స్వాగతం పలికారు..అనంతరం 16వ డివిజన్ ఆదిత్య నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర,15వ డివిజన్ చిన్న మసీదు సెంటర్ వద్ద,8వ డివిజన్ రెబల పార్క్ వద్ద..6వ డివిజన్ పప్పుల విధి వాటర్ ట్యాంక్ దగ్గర,5వ డివిజన్ అహ్మద్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద,5వ డివిజన్ వైకుంఠ పురం అంగన్ వాడి స్కూల్ వద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ లను మంత్రి ప్రారంభించారు..ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడరు.. నెల్లూరులో ఇప్పటికే 15 ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను పూర్తి చేసి ప్రజలకు సురక్షిత మంచినీళ్లు అందిస్తున్నామని ..ఈ రోజు మరో ఆరు వాటర్ ప్లాంట్ ను ప్రారంభించామన్నారు.. మరో నాలుగు సుజల వాటర్ ప్లాంట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని.. మరో 10 అండర్ ప్రాసెస్ లో ఉన్నాయన్నారు.. గత వైసీపీ ప్రభుత్వం మంచినీటి పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేపిందని మండిపడ్డారు..ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పేదలకు శుద్ధమైన నీరందించాలని 2014 లో ఈ పథకాన్ని ప్రారంభించారని…ఐతే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని… ఈ పథకాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు..ఏడాదిన్నరలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని..డెవలప్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిందన్నారు..పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి ,టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు ,పబ్లిక్ హెల్త్ ,ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు .








