
పెరమన బాదితులు కన్నీరు తుడిచిన మంత్రి నారాయణ
నెల్లూరు నవంబర్ 01 అనంత జనశక్తి న్యూస్
సంఘం మండలం పెరమన జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరులోని గుర్రాల మడుగు సంఘానికి చెందిన శేషం షరమ్మ,శేషం బాల వెంగయ్యలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు వెళ్లి వారిని పరామర్శించారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు మంత్రి నారాయణ 5 లక్షల ఆర్ధిక సాయం అందించారు.. ఈ నేపద్యంలో ఇవాళ మృతుల కుటుంబాలను మంత్రి నారాయణ పరామర్శించారు. వారి కన్నీరు తుడిచారూ. అధైర్య పడొద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.. ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా లబ్ది చేకూరేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కారును ఇసుక టిప్పర్ డీ కొట్టిన ఘటనలో గుర్రాల మడుగుకి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు..








