
అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్ష…
అనంతపురం, నవంబర్ 1 , అనంత జనశక్తి న్యూస్
ఉరవకొండ మండలంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో కౌకుంట్ల లోని తన నివాసంలో రాష్ట్ర ఆర్థిక , ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్షసమావేశంనిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ ఉరవకొండలో ప్రధానంగా డ్రైనేజీ , త్రాగునీటి సరఫరా అంశాలలో ప్రత్యేక దృష్టిని సారించాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధుల వినియోగం మరియు అమలవుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనితీరు గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు మంజూరైన నిధుల వివరాలు జరుగుతున్న పనుల విషయాలు అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా హెల్త్ క్లినిక్కులనిర్మాణం ఉరవకొండ పట్టణంలో నూతన కాయగూరల మార్కెట్ ఏర్పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు పై ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకొని అవసరమైన మేరకు ప్రతిపాదన నివేదికలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. మండల కేంద్రంలో చాలా కాలంగా పాతబడిన భవనాలు మండల స్థాయిలో ఉన్న వాటిని పరిశీలించి నూతన కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చాలామంది నిరుపేదలు ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని అర్హులకు ఇంటి స్థలాలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో రవిప్రసాద్ పంచాయతీరాజ్ డిఇ రసూల్ ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీవో సతీష్ సుప్రీం పంచాయతీ సెక్రెటరీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.








