
ఎరువుల దుకాణాల తనిఖీ.
-దుకాణాల వద్ద ధరల పట్టికలు ఏర్పాటు చేసి, రైతులకు కొనుగోలు రసీదు ఇవ్వాలి.
-ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఐ ఎఫ్ ఎం ఎస్ నమోదు చేయాలి.
-నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు.
-వ్యవసాయ సంచాలకు లు లక్ష్మణ నాయక్, వ్యవసాయ అధికారి ముస్తఫా.
ధర్మవరం నవంబర్ 13, అనంత జనశక్తి న్యూస్:
పట్టణంలోని ఎరువుల దుకాణాలపై సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్ మండల వ్యవసాయ అధికారి ముస్తఫా ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బీసీ ఎంఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ….. రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, దుకాణము వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, ఎరువుల ధరలు, స్టాకు నిలువలు ప్రతిరోజు అప్డేట్ చేయాలని వారు ఆదేశించడం జరిగింది. ఎంఆర్సికి మించి విక్రయించకూడదని కూడా వారు హెచ్చరించారు. అలా విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఐ ఎఫ్ ఎం ఎస్ నందు నమోదు చేయాలని తెలిపారు. నిబంధనలు పాటించని యెడల చట్టపరమైన చర్యలు తప్పక తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.








