
విద్య, వైద్యమే ఈ ప్రభుత్వానికి మొదటి ప్రధాన్యత
కష్టం ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందిస్తున్నారు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా పరిటాల శ్రీరామ్
ఇద్దరికి రూ.89.88వేల చెక్కులు అందజేసిన శ్రీరామ్
ధర్మవరం నవంబర్ 02 అనంత జనశక్తి న్యూస్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఈ ప్రభుత్వానికి విద్య, వైద్యమే మొదటి ప్రధాన్యత అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మవరం మండలం దర్శినమలకు చెందిన అంజనాబాయికి 70వేలు, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన వినయ్ కు 19వేల రూపాయల చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, శ్రీరామ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైద్యం విషయంలో ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలకు ఎక్కడా ఆటంకం కల్గకుండా ప్రభుత్వం చూస్తోందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని వారిని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే సాయం చేస్తున్నారని శ్రీరామ్ అన్నారు…








