
వైసీపీ నేతల భూ కబ్జాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
వైసీపీ నాయకుల మద్దతుతో స్మశాన భూమి ఆక్రమణ
సర్వే చేసిన భూమి వెబ్‌ల్యాండ్‌లో గల్లంతు.. న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి
అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మాజీ మంత్రి, టీడీపీ జనరల్ సెక్రటరీ దేవినేని ఉమా మహేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్
విజయవాడ డిసెంబర్ 03 అనంత జనశక్తి న్యూస్
అన్నమయ్య జిల్లా సంబేపల్లికి చెందిన సుబ్బరాజు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. 1997వ సంవత్సరంలో ఈనాడు విలేకరుగా పనిచేశాను. అయితే అప్పటి ప్రభుత్వంలో తమకు సంబేపల్లి గ్రామంలో ప్లాట్ నెంబర్ 81, బ్లాక్ నెంబర్ 100లో 3 సెంట్ల స్థలం ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని నేతలు మాజీ మంత్రి, టీడీపీ జనరల్ సెక్రటరీ దేవినేని ఉమా మహేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.సత్యసాయి జిల్లా పరిగి మండలం వన్నంపల్లి గ్రామానికి చెందిన రామంజనేయ రెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్ 183 చెరువు పోరంబోకు వద్ద ఉన్న స్మశాన భూమి విషయమై గ్రామ తమహసీల్దార్ కి అర్జీ ఇవ్వగా కార్యాలయం R.C No:280/8/2024 ద్వారా స్మశానం అదే ప్రదేశంలో ఉన్నట్లు గుర్తించి స్కెచ్ విడుదల చేశారు. గ్రామస్తులు స్వయంగా రూ. 25,000 ఖర్చు చేసి చెట్లను తొలగించి శుభ్రపరిచారు. తహశీల్దార్ పరిశీలన తర్వాత స్మశానాన్ని జయమ్మ కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించాడు. వీరికి స్థానిక వైసీపీ నాయకుల మద్దతు ఉంది. దాంతో పాటు తహసీల్దార్ కూడా ప్రజలకు సహకరించకుండా అక్రమదారుల వైపు నిలుస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని స్మశాన భూమిని రక్షించాలని కోరాడు.కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నం. 411-7 – 0.42 సెంట్లు, అలాగే ఆవుల జగదీష్ బాబు ఖాతా నం. 177, సర్వే నం. 411-8 – 0.47 సెంట్లు భూమి కలదు. ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో పూర్వంలో వెబ్‌ల్యాండ్‌లో నమోదు అయి, రైతులకు పట్టాదారు పాసుబుక్లు కూడా జారీ అయ్యాయి. ఇటీవల అధికారులు సర్వే చేసి భూములు యథావిధిగా ఉన్నట్లు ఎండార్స్‌మెంట్ కూడా జారీ చేశారు. అయితే సర్వే అనంతరం ఈ రెండు సర్వే నంబర్లు 411-7, 411-8 వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో కనిపించడంలేదు. తద్వారా అడంగల్, 1బీ రావడం లేదు. కావునా తమయందు దయవుంచి తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మండగండి గ్రామానికి చెందిన సత్య సూర్యకుమారి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 2021లో యండగండి, పామరు గ్రామాలకు ఎంపీటీసీ టీడీపీ అభ్యర్ధిగా గెలిచాను. తమ గ్రామంలో గృహం నిర్మించుకోవడానికి పత్తిపాటి శ్రీహరి దగ్గర 60 వేలు అప్పుగా తీసుకోని అతనికి ఇళ్లు తనఖా రాసి ఇచ్చాం. కోర్టు తీర్పు ప్రకారం రూ.1,80,000 డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పుదారైన పాత్తిపాటి శ్రీహరి డబ్బు స్వీకరించకుండా ఇంటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన రెడ్డెప్ప గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామం సర్వే నం. 1117లో గల మొత్తం 4.53 సెంట్ల భూమి ఉంది. అందులో య. 1.55 సెంట్లు పొరంబోకు భూమిని సుమారు 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. గతంలో ప్రభుత్వంలో ఆ భూమిని సాగు చేయకుండా అడ్డుకున్నారు. తమ భూమికి సంబంధించిన ఆధారాలతో కోర్టు వెళ్లాగా.. అప్పటి నుంచి సాగు చేసుకోమని చెప్పారు. మరళ ఇప్పుడు కొంతమంది వైసీపీ కోవర్టులు కలెక్టర్ కి అర్జీ ఇచ్చి తమను భూమిలోకి వెళ్లకుండా చేస్తున్నారు. కావునా తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం రాచాయపేట గ్రామానికి చెందిన వెంకటయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నం. 356/6లో ఉన్న 2.75 సెంట్లు భూమి ఉంది. దానికి ప్రభుత్వం 1987లో పట్టా జారీ చేసింది. తమ అన్నయ్య నరసింహులుకు పడమర దిశలో 6.00 సెంట్లు భూమి ఉంది. అన్నయ్య జీవించి ఉన్నంతకాలం దారిని అనుమతించగా ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు ముళ్లకంచె వేసి దారిని పూర్తిగా మూసివేశారు. మెడమల సుబ్బమ్మ, మెడమల శ్రీహరి, మెడమల వీరాంజనేయులు, అలాగే ఉత్తరాన ఉన్న కోటపాటి ఆదిలక్ష్మమ్మ దారిని పూర్తిగా అడ్డగించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన షణ్ముఖవర్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం. 192/1 స్థలం ఉంది. అందులో ఉన్న రేకుల షెడ్డును పడవేసి స్థలాన్ని కబ్జా చేశారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.








