
దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు
మంగళగిరిలో దివ్యాంగుల దినోత్సవంలో దేవినేని ఉమా సందేశం
“వైకల్యం శరీరానికే… సంకల్పానికి కాదు” — ప్రతిభను వెలిగించే వేదికగా ప్రభుత్వ పథకాలు
మంగళగిరి డిసెంబరు 03, అనంత జనశక్తి న్యూస్
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొని దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రతిభతో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, సంక్షేమ పథకాలు వారికి మరింత నమ్మకం, బలం ఇస్తున్నాయి” అన్నారు.అలాగే, “దివ్యాంగులకు నెలకు రూ.6,000 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది సామాజిక న్యాయం, సంక్షేమంపై కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొని దివ్యాంగుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. దివ్యాంగుల హక్కులు, అవకాశాలు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వారు తెలిపారు.కార్యక్రమంలో భారీ సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.








