
తెప్పపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చిన శ్రీ సుందరరాజ స్వామి
వైభవంగా రెండో రోజు తెప్పోత్సవం నిర్వహణ
తిరుపతి జూన్ 27 అనంత జనశక్తి న్యూస్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు పద్మసరోవరంలో శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించగా, మధ్యాహ్నం పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం చేపట్టారు.సాయంత్రం ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేసి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.








