భద్రాద్రి ఆలయ విస్తరణకు శ్రీకారం

భద్రాద్రి ఆలయ విస్తరణకు శ్రీకారం

రూ.586 కోట్లతో మహా ప్రణాళిక.. తొలి విడత పనులు ప్రారంభం

హైదరాబాద్ అనంత జనశక్తి న్యూస్

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. రూ.586 కోట్ల వ్యయంతో రూపొందించిన మహా ప్రణాళికలో భాగంగా తొలి విడతలో రూ.200 కోట్ల నిధులతో ఆలయ విస్తరణ పనులు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి ప్రధాన పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.