
శిలా తోరణం
తిరుమల కొండపై ఉన్న అపూర్వ శిలా తోరణమిది.ఈ శిలాతోరణం సుమారు 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా.ఈ తోరణం లోని శిలలు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనవని భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా. గాలి మరియు నీటి కోత వల్ల క్వార్ట్జైట్ శిలలు ఈ ఆకారాన్ని సంతరించుకున్నాయి. ప్రపంచంలోనే ఇలాంటి సహజ తోరణాలు చాలా అరుదు. ఆసియా ఖండంలో ఇలాంటివి కేవలం మూడు మాత్రమే ఉన్నాయని చెబుతారు.కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుండి భూమికి దిగివచ్చినప్పుడు, మొదటి అడుగు ఈ ప్రదేశంలోనే వేశారని భక్తుల నమ్మకం. అందుకే దీనిని “శ్రీవారి పాదాలు” ఉన్న ప్రాంతంగా పవిత్రంగా భావిస్తారు. ఈ తోరణం ఎత్తు స్వామివారి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని చెబుతుంటారు.కొన్ని సంవత్సరాల క్రితం ( exact గా గుర్తు లేదు కానీ 1994-95) అక్కడ సెక్యూరిటీ అతన్ని రిక్వెస్ట్ చేసి గేటు తీయించి అతను చెప్పిన వైపు చూడగా.. అక్కడ రెండు శిలల మీద సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖు,చక్రాలు చూడటం జరిగింది…అద్భుతం.. ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాము.. అప్పట్లో భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది..ఇది గుడికి చాలా దగ్గర…మ్యూజియం కి ప్రక్కనే ఏపీ టూరిజం వారి శ్రీనివాసం అనే హోటల్ ఉంటుంది దాని ప్రక్కనే ఉన్న రోడ్డు గుండా వెళితే 1 km అంతే..
ఇక్కడ ఇదే దారిలో..
శిలా తోరణం శ్రీ వారి పాదాలు
వేద పాఠశాల
చక్ర తీర్థం …అన్నీ దగ్గరే..








