
పట్టపగలు కర్ణాటకలో దారుణం
రోడ్డుపైనే భార్య హత్య, మృతదేహంపై కారుతో దూసుకెళ్లిన భర్త
కర్ణాటక మార్చి 28,అనంత జనశక్తి న్యూస్
కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శైల (28) అనే మహిళను ఆమె భర్త అక్షయ్ జాదవ్ అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు సమాచారం.పోలీసుల వివరాల ప్రకారం, కారులో ప్రయాణిస్తున్న సమయంలో భార్యను బయటకు ఈడ్చి, నడిరోడ్డుపైనే గొంతు కోసి హత్య చేశాడు. అంతేకాకుండా, ఆమె మృతదేహంపై కారును నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు బయటకు రావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ దంపతులు మహారాష్ట్రకు చెందినవారు. వారు గంగాపూర్‌లోని దత్తాత్రేయ ఆలయంను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఘటన అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








