
అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తత…
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి!
అంతర్జాతీయ వార్త “అనంత జనశక్తి న్యూస్”
ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతాలు ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రానికి సమీపంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడుల్లో వంద మందికి పైగా స్థానికులు గాయపడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.అయితే ఈ దాడుల్లో ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) స్పష్టం చేసింది. పరిస్థితిని అంతర్జాతీయ స్థాయిలో సమీక్షిస్తున్నట్లు కూడా వెల్లడించింది.ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.








