Logo
Date of Publish : 22 March 2026, 9:36 am
Editor : Shankaragallu Venkatesulu

అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తత…

అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తత…

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి!

అంతర్జాతీయ వార్త "అనంత జనశక్తి న్యూస్"

ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతాలు ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రానికి సమీపంలో  ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడుల్లో వంద మందికి పైగా స్థానికులు గాయపడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.అయితే ఈ దాడుల్లో ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) స్పష్టం చేసింది. పరిస్థితిని అంతర్జాతీయ స్థాయిలో సమీక్షిస్తున్నట్లు కూడా వెల్లడించింది.ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)