ఉగాది వేడుకల్లో పాల్గొన్న జగన్ దంపతులు

ఉగాది వేడుకల్లో పాల్గొన్న జగన్ దంపతులు

విజయవాడ మార్చి 19″అనంత జనశక్తి న్యూస్”

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి పాల్గొన్నారు.పండితుల ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రవణంలో జగన్ దంపతులు పాల్గొని నూతన సంవత్సర ఫలితాలను శ్రద్ధగా విన్నారు. ఈ వేడుకలకు పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్, నూతన సంవత్సరం అందరికీ సుఖసంతోషాలు, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు.