ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ అనంత జనశక్తి న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ, ఐజీ కూడా పాల్గొన్నారు.రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్ల అంశంపై హోంమంత్రితో సమగ్ర చర్చ జరిగింది. ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు, లొంగుబాటు ప్రక్రియ వేగవంతం చేయడం, పునరావాస చర్యలు తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.అలాగే “మావోయిస్టు రహిత భారత్” కాన్ఫరెన్స్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు, రాష్ట్రాల సహకారం, భద్రతా వ్యూహాలపై కూడా చర్చించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అంతర్గత భద్రతను బలోపేతం చేసే దిశగా కేంద్రం చేపడుతున్న చర్యలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది.