
బడ్జెట్‌కు ముందే లోక్‌సభలో ఆర్థిక సర్వే: దేశ ఆర్థిక దిశకు సంకేతాలు
న్యూఢిల్లీ: జనవరి 28 అనంత జనశక్తి న్యూస్
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను సభలో ఉంచడం అనేది ఏటా అనుసరిస్తున్న ఆనవాయితీ.గత ఒక సంవత్సరం కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, వృద్ధి ధోరణులు, పరిశ్రమలు, వ్యవసాయం, సేవారంగం వంటి వివిధ రంగాల పరిస్థితులను ఈ సర్వే సమగ్రంగా వివరిస్తుంది. అలాగే రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశం ఎదుర్కొనే అవకాశాలు, సవాళ్లపై ముందస్తు అంచనాలను కూడా ఇందులో పొందుపరిచారు.బడ్జెట్‌కు దిశానిర్దేశం చేసే కీలక పత్రంగా ఆర్థిక సర్వేను భావిస్తారు. దేశ ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అవగాహన కల్పించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.








