మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామ

తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణస్వీకారం

ముంబై/అనంతజనశక్తి న్యూస్:

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన, చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడంతో ఏర్పడిన రాజకీయ ఖాళీని భర్తీ చేస్తూ, ఆయన సతీమణి సునేత్ర పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు నేడు సాయంత్రం ముంబైలోని లోక్‌భవన్‌లో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఇదితో మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా డిప్యూటీ ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డు సృష్టించనున్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతలు ఆమె పేరును ప్రతిపాదించగా, సునేత్ర పవార్ ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు.ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా, ఆ సమావేశంలో సునేత్ర పవార్‌ను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకునే అవకాశం ఉంది. అనంతరం ఆమె డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ప్రస్తుత అంచనాల ప్రకారం సునేత్ర పవార్‌కు ఎక్సైజ్, క్రీడా శాఖలు కొనసాగించే అవకాశం ఉండగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద ఆర్థిక శాఖ కొనసాగనుందని సమాచారం. అలాగే త్వరలో జరగనున్న బారామతి ఉపఎన్నికలో సునేత్ర పవార్ పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.అజిత్ పవార్ మరణంతో కలిగిన విషాదం నడుమ, ఈ రాజకీయ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.