రికార్డులను తనిఖీ చేసిన రెవెన్యూ డివిజన్ అధికారి 

రికార్డులను తనిఖీ చేసిన రెవెన్యూ డివిజన్ అధికారి

యాడికి, డిసెంబర్ 17, అనంత జనశక్తి న్యూస్

మండల కేంద్రంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులు వీఆర్వో,గ్రామ సర్వేయర్ లతో మాట్లాడుతూ విధులను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.పి జి ఆర్ ఎస్ అర్జీలను పరిశీలించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.